కలియుగ వైకుంఠనాధుడు...తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చరిత్రలో తొలిసారి ఏకాంతంగా సాగనున్నాయి. ఏటా బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటే వేళ వివిధ వాహనాలపై శ్రీదేవిభూదేవి సమేతుడై విహరించే మలయప్పను కనులారా వీక్షించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చేవారు. కానీ ఈ సారి కరోనా మహమ్మారి ప్రభావంతో వార్షిక బ్రహోత్సవాలను అంతరాలయానికే పరిమితం చేయాలని తితిదే ధర్మకర్తలమండలి నిర్ణయం తీసుకుంది. మునుపెన్నడూ లేని విధంగా రంగనాయకుల మండపానికే స్వామి వారి ఉత్సవాలు పరిమితం కానున్నాయి.
ఇదీ చదవండి : విశాఖ సాగర తీరంలో బయటపడిన యుద్ధ బంకర్లు