తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరుతూ.. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం నిదిగల్లులో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనపై విమర్శలు గుప్పించిన అచ్చెన్నా.. 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడం తథ్యమన్నారు. పేదలకు ఇస్తామన్న 3 వేల రూపాయల పెన్షన్ ఇవ్వని సీఎం జగన్ను ఎన్నికల్లో ఓడించి సర్కార్ కళ్లు తెరిపించాలన్నారు.
మండుతున్న ధరలు
వైకాపా, భాజపా పాలనలో నిత్యావసర ధరలు మండిపోతున్నాయని తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మీ మండిపడ్డారు. సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్రం నుంచి నాలుగో సింహంగా పోరాడుతానన్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ తెదేపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: