తిరుమలలో సర్వదర్శనం టోకెన్లను తితిదే పునఃప్రారంభించింది.. రోజుకు రెండు వేల సర్వదర్శనం టికెట్లను జారీచేయనుంది . సర్వదర్శనం టికెట్లు ప్రస్తుతానికి చిత్తూరు జిల్లా భక్తులకే పరిమితం చేసింది. కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టోకెన్ల జారీని తితిదే నిలిపివేసిన తితిదే.. ఇవాళ్టి నుంచి ప్రారంభించింది.
టికెట్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఎన్ని రోజుల పాటు టిక్కెట్లు జారీ చేస్తారనే సమాచారంపై స్పష్టత లేకపోయినా.. సుదీర్ఘ విరామం తర్వాత టోకెన్లు ఇస్తుండటంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు . ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందిన భక్తులకు టోకెన్లను నిరాకరించింది. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధితో టోకెన్లు జారీ చేయనుంది. తిరుపతిలోని శ్రీనివాసం అతిథిగృహం వద్ద టికెట్లు పొందిన భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
నిన్న శ్రీవారిని 21,362 మంది భక్తులు దర్శించుకున్నారు. 9,762 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.17 కోట్లుగా తితిదే తెలిపింది.
ఇదీ చదవండి:
Cheating: 30 మంది యువతులను మోసం చేసి.. రూ.కోట్లలో నగదు కాజేసి