ETV Bharat / city

భక్తులకు మృగాల నుంచి ప్రమాదం లేకుండా తితిదే చర్యలు

వన్యప్రాణుల సంరక్షణతో పాటు... భక్తులకు భద్రత కల్పించే లక్ష్యంతో తితిదే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. కరోనా నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య పరిమితమవడం... భక్తజనంతో కిక్కిరిసిపోయే తిరుగిరులు నిర్మానుష్యంగా మారగా.. వన్యప్రాణులు జనావాసాల్లో సంచరిస్తున్నాయి. అప్రమత్తమైన తితిదే జనావాసాల్లోకి వచ్చే వన్యప్రాణుల నుంచి భక్తులకు భద్రత కల్పించే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టింది. మృగాల సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రదేశాల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వన్యప్రాణుల సంరక్షణా చట్ట పరిధికి లోబడి... భక్తులకు మృగాల నుంచి ప్రమాదం లేకుండా ఉండేలా చర్యలు తీసుకొంది. తిరుగిరుల్లో ఏర్పాటు చేసిన సరికొత్త కెమెరాలు... శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తుల భద్రతకు తితిదే చేపట్టిన చర్యలపై ఈటీవీభారత్ ప్రత్యేక కథనం.

author img

By

Published : Sep 17, 2020, 7:37 PM IST

Updated : Sep 18, 2020, 10:45 AM IST

Special Cameras set in Tirumala Over Devotees security
భక్తులకు మృగాల నుంచి ప్రమాదం లేకుండా తితిదే చర్యలు

నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుగిరులు... కరోనా ప్రభావంతో నిర్మానుష్యంగా మారాయి. కాలాలతో సంబంధం లేకుండా భక్త జనంతో కిక్కిరిసిపోయే తిరుమల... దర్శనాల సంఖ్యను తితిదే పరిమితం చేయగా భక్తుల సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా శేషాచల అభయారణ్యంలో ఉన్న తిరుమలలో వన్యప్రాణుల సంచారం పెరిగింది. ప్రాంతం ఏదైనా జింకలు, దుప్పులు వంటి సాధు జంతువులు మొదలు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు తిరువీధుల్లో యధేచ్ఛగా తిరుగుతున్నాయి. గతంలో భక్తుల రద్దీతో ఉండే ప్రాంతాల్లోనూ వన్యప్రాణులు సంచరిస్తున్నాయి. జీఎన్‌సీ టోల్‌గేట్‌, బాహ్యవలయ రహదారి, ఎస్వీ గెస్ట్‌హౌస్‌, పద్మావతి ప్రాంతం, ఎంబీసీ ప్రాంతం, కౌస్తుభం అతిథి గృహం, బాలాజీనగర్‌ ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశిస్తున్నాయి. సాధారణ రోజుల్లో భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఇపుడు చిరుత పులులు దర్శనమిస్తున్నాయి.

చీకటిపడితే తిరుమల వీధుల్లో వన్యప్రాణులు ప్రత్యక్ష అవుతుండటంతో తితిదే అధికారులు అప్రమత్తమయ్యారు. క్రూరమృగాల నుంచి భక్తులకు భద్రత కల్పించడానికి చర్యలు చేపట్టారు. అడవి జంతువులు తరచూ సంచరించే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తగినజాగ్రత్తలు తీసుకొంటున్నారు. ధర్మగిరి వేదపాఠశాల, శ్రీవారిపాదాలు, పాపవినాశనం, కాలినడక మార్గాల నుంచి తిరుమలలోకి ప్రవేశించే ప్రాంతాలు ఇలా వన్యప్రాణుల సంచారం అధికంగా ఉండే 39 ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు తిరుమల రహదారిపైకి వచ్చిన వెంటనే వాటి ఆచూకి తెలిపేలా భద్రత పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి సమాచారం చేరేలా ఏర్పాటు చేశారు. క్రూరమృగాల సంచారాన్ని గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను అప్రమత్తం చేయడంతో పాటు... అలారం మోగేలా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కెమెరాలను వినియోగిస్తున్నారు.

మరో వైపు సాయంత్రం ఆరు గంటల తర్వాత వన్యప్రాణుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల వైపు భక్తుల సంచారం నియంత్రిస్తున్నారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిరంతరం గస్తీకాసేలా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ...న్యాయవ్యవస్థపై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు

Last Updated : Sep 18, 2020, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.