తిరుమల అలిపిరి నడక మార్గంలో ఓ మహిళను పాము కరిచింది. గాలి గోపురం వద్ద ఉన్న దుకాణంలోకి ప్రవేశించిన జెర్రిపోతు.. అక్కడే పనిచేసే మహిళను కాటు వేసింది. పాము కాటుగు గురైన మహిళ కేకలు వేయడంతో తోటి దుకాణ దారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తిరుమల భద్రతా సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే భాస్కర్ నాయుడిని పిలిపించి పట్టించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృహిళకు ఎటువంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: తిరుమలలో శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమం రద్దు