తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ కోసం చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే వైకాపాను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలను అర్హులకు నేరుగా అందిస్తున్నామని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికను తమ పార్టీ రెఫరెండంగా తీసుకుంటోందని చెప్పారు. ప్రభుత్వ పనితీరుకే కాదు.. విపక్షాలు చేస్తున్న ప్రచారానికీ ప్రజలు ఇచ్చే తీర్పుగా భావిస్తున్నామన్నారు. ప్రలోభాలకు గురి చేసే వారికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని సూచించారు.
ఇదీ చదవండి:
వైకాపా సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: శైలజానాథ్