ETV Bharat / city

నేటి నుంచి ‘ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌’.. ప్రారంభించనున్న సీఎం - Police State Duty Meet

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీమీట్.. నేటి నుంచి ప్రారంభం కానుంది. తిరుపతిలో ఇవాళ్టి నుంచి 7వ తేదీ వరకూ నిర్వహించనున్న ఈ రాష్ట్రస్థాయి పోటీల కోసం పోలీస్ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల్లో భాగంగా బలగాల విన్యాసాలు, ఆయుధసంపత్తి, సాంకేతిక నైపుణ్యాలు ప్రదర్శించనున్నారు. సైబర్ నేరాలు, మహిళాభద్రత తదితర అంశాలపై సింపోజియంను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Police State
Police State
author img

By

Published : Jan 4, 2021, 6:32 AM IST

Updated : Jan 4, 2021, 8:48 AM IST

నేటి నుంచి ‘ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌’.. ప్రారంభించనున్న సీఎం

తిరుపతి వేదికగా ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న స్టేట్‌ పోలీస్‌ డ్యూటీమీట్‌కు.. 'ఇగ్నైట్‌'గా నామకరణం చేశారు. నేటి నుంచి ఈనెల 7వ తేదీ వరకూ పోలీస్‌ పరేడ్‌ మైదానం, కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాల వేదికగా వేడుకలు జరగనున్నాయి. ఈ సంబరాల్లో ప్రధానంగా రక్షక దళాల పోరాట పటిమ, శక్తియుక్తులు, ఆయుధసంపత్తి, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించి.. ప్రసంగించనున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను.. జాతీయస్థాయి ప్రమాణాలతో నిర్వహించాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. పోలీస్‌ శాఖ శక్తియుక్తులు చాటిచెప్పే విధంగా 18 విభాగాల్లో 22 పోటీలను నిర్వహించనున్నారు. అందుకోసం 13 జిల్లాల నుంచి 450 మంది పోలీస్‌ సిబ్బంది తిరుపతి నగరానికి తరలివచ్చారు. కల్యాణి డ్యాం పోలీస్‌ శిక్షణా కళాశాలలో పోటీలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కంప్యూటర్‌ అవగాహన, డాగ్‌స్క్వాడ్‌, ఫోటోగ్రఫీ, పొట్రేట్‌ పార్లే, ఫింగర్‌ ప్రింట్‌, ఐఓ ఫోటోగ్రఫీ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా 40 మంది ఐపీఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు. జిల్లా పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ప్రధాన కార్యక్రమాలు, ప్రత్యేక సమావేశాలు, సదస్సులు జరుగుతాయి.

స్టేట్‌ పోలీస్‌ డ్యూటీమీట్‌ను కేవలం పోటీలకు మాత్రమే పరిమితం చేయకుండా.. ఈసారి సామాజిక బాధ్యత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకున్నారు. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరు, మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. సింపోజియం నిర్వహించనున్నారు. ఆయా విభాగాల్లో నిపుణులైన 220 మంది ప్రతినిధులను చర్చలు, ఉపన్యాసాల కోసం ఆహ్వానించారు. సాంకేతికత పురోగతే లక్ష్యంగా ఐఐటీ, ఐసర్‌, ట్రిపుల్‌ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.

స్టేట్ డ్యూటీమీట్ కోసం తిరుపతి నగరానికి చేరుకున్న డీజీపీ గౌతం సవాంగ్‌.. పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాట్లను పరిశీలించారు. నాలుగు రోజులపాటు నగరంలోనే ఉంటూ డ్యూటీమీట్‌ను పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండి: రైతులు- కేంద్రం మధ్య నేడు ఏడో విడత చర్చలు

Last Updated : Jan 4, 2021, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.