చిత్తూరు శివార్లలోని పెనుమూరు క్రాస్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఓ లారీలో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్ఈబీ పోలీసులు విచారించారు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్ రెడ్డి, తిరుపతికి చెందిన కిశోర్ కుమార్ అనే ఇద్దరు రేషన్ బియ్యాన్ని సేకరించి లారీలలో కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మహేశ్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు తిరుపతిలో కిషోర్ కుమార్తో మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వివరించారు. నిందితుల గోదాములో సోదాలు చేశారు. అక్కడ అక్రమ రవాణాకి సిద్దంగా ఉన్న 34 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
భూకబ్జాపై దివ్యాంగురాలి వీడియో వైరల్... మంత్రి నుంచి ఫోన్...