fake tickets in Tirumala : తిరుమలలో నకిలీ టిక్కెట్ల బాగోతం వెలుగుచూసింది. నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నలుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు. మంగుళూరుకు చెందిన ఓ భక్తుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు దళారులపై కేసు నమోదు చేశారు. ఓ ట్యాక్సీ డ్రైవర్.. మంగుళూరుకు చెందిన భక్తుడి వద్ద రూ.3,200 తీసుకుని.. నకిలీ టికెట్లు విక్రయించాడు. ఘటనపై తితిదే విచారణలో ముగ్గురు ట్యాక్సీ డ్రైవర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. నిందితులు రెడ్డి ఈశ్వర్, బాబునాయక్, సుదర్శన్ రెడ్డిలుగా గుర్తించి.. వారిపై కేసు నమోదు చేశారు.
మరో దళారిపై కేసు..
నకిలీ సిఫార్సు లేఖతో టికెట్లు విక్రయిస్తున్న మరో దళారిపై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు దళారి విశ్వశాంతి కుమార్‌గా గుర్తించారు. హైదరాబాద్‌కు చెందిన పవన్ కుమార్‌కు ఐదు బ్రేక్ దర్శన టికెట్లను రూ.10 వేలకు విక్రయించినట్లు దర్యాప్తులో తెలిందన్నారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో విజిలెన్స్ తనిఖీల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలుకు చెందిన ఓ నాయకుడి పేరిట సిఫార్సు లేఖను దళారి విశ్వశాంతి కుమార్ తయారు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి