తిరుపతి నగరపాలక సంస్థ 36వ డివిజన్ నుంచి తెదేపా అభ్యర్థిగా పర్వీన్ పోటీ చేస్తున్నారు. ప్రచారం చేయనీయకుండా.. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె భర్త ఆరోపించారు. గత 3 రోజుల నుంచి విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపిస్తున్నారని చెప్పారు. ఎన్నికలు వాయిదా పడటానికి ముందు నామినేషన్లు వేశాక 5 సార్లు పిలిపించి.. బెదిరించారని అన్నారు.
పోలీసుల తీరుతో ప్రచారం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అడ్డుపెట్టుకొని.. ఎన్నికల నుంచి తప్పించాలన్న కుట్రతోనే వైకాపా నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత సంజయ్ ఆరోపించారు. పోలీసుల వేధింపులను జిల్లా ఎస్పీ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
ఇదీ చదవండి:
ప్రభుత్వ ఉద్యోగి అదృశ్యమైతే.. ఏడేళ్ల తర్వాతే కారుణ్య నియామకమా?