ETV Bharat / city

'ప్రత్యక్షంగా చేయలేని దానిని... పరోక్షంగా చేస్తున్నారు' - తిరుమల వార్తలు

తితిదే బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు దేవాదాయ చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​పై హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రత్యక్షంగా చేయలేని దానిని పరోక్షంగా చేస్తున్నారని పిటిషనర్ తెలిపారు.

High Court
High Court
author img

By

Published : Feb 22, 2022, 3:19 AM IST

Updated : Feb 22, 2022, 4:23 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేందుకు వీలుకల్పిస్తూ... ఏపీ దేవాదాయ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ' ఆర్డినెన్స్'పై హైకోర్టులో పిల్ దాఖలైంది. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్ రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

అత్యవసరంగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సినంత పరిస్థితులు రాష్ట్రంలో లేవన్నారు. 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తే హైకోర్టు ఆ జీవోలపై స్టే ఇచ్చిందన్నారు. ఆ ఉత్తర్వులను పరోక్షంగా తప్పించుకుని ఆ నియామకాలకు శాసన అనుమతి పొందేందుకు ఆర్డినెన్స్ తెచ్చారన్నారు. పరిస్థితులు భిన్నంగా ఉన్నా గవర్నర్ జారీ చేశారన్నారు. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో ప్రత్యక్షంగా చేయలేని దానిని పరోక్షంగా చేస్తున్నారన్నారు. ఆర్డినెన్స్ తీసుకురావడం రాజ్యాంగ విధానాన్ని వంచించడమేనన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని ఈ నెల 9న తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరారు.

ఇదీ చదవండి : TTD: తితిదేలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి చట్టసవరణ ?

Last Updated : Feb 22, 2022, 4:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.