తిరుపతి ఎంపీ అభ్యర్థిపై వారంలో నిర్ణయం ప్రకటిస్తామని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ భేటీ అయ్యారు. మరోమారు సమావేశం తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. భాజపా బరిలో నిలిస్తే జీహెచ్ఎంసీ స్థాయిలో బలంగా పోటీ చేయాలని పవన్ అభిప్రాయపడ్డారు.
జనసేన బరిలో నిలిస్తే 7 నియోజకవర్గాల్లోనూ తానే ప్రచారం చేస్తానని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర నాయకత్వంతో క్షేత్ర సమస్యలు ఉన్నట్లు పీఏసీలో చెప్పారన్న పవన్... గతంలో ఇబ్బందులు ఉంటే భాజపా అగ్రనాయకత్వంతో మాట్లాడానని వివరించారు. మతం పేరిట రాజకీయాలు చేయలేకే రామతీర్థం వెళ్లలేదని పేర్కొన్నారు.
మత సామరస్యం కోసం రాజకీయ లబ్ధి వదులుకుంటానని పవన్ ఉద్ఘాటించారు. ఏ ప్రార్థనా మందిరంపై దాడి జరిగినా ఒకే విధంగా స్పందించాలని నేతలకు సూచించారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు జనసేన సిద్ధాంతమని స్పష్టం చేశారు. తిరుమలకు చేరుకున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్... రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండీ... తిరుపతి ఉపఎన్నికలో జనసేన, భాజపా పొత్తు