తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. 2010లో తితిదేలో నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందని..ఆ విధంగా సొసైటీలు ఏర్పాటయ్యాయన్నారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పొరేషన్ ఎందుకు ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నాయని పవన్ దుయ్యబట్టారు. ఇందుకు ఇసుక విధానం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు. ఆ రీతిలోనే 73 సంఘాలను రద్దు చేసి కార్పొరేషన్‌గా మార్చి ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చటమే ఉదాహరణలుగా పేర్కొన్నారు. ఒకే పని చేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు ఒకే వేతనం చెల్లించాలని జస్టిస్ జె.ఎస్.ఖేహార్ 2016లో వెలువరించిన తీర్పును విస్మరించారన్నారు.
కార్పొరేషన్లో చేరని ఉద్యోగులను..బెదిరిస్తున్నారని వారిని కార్పోరేషన్లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా?. కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం..నిధులు దారి మళ్లించేందుకేనా ?. బోర్డును నియమించే హక్కు ఎవరికుంది?. ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా ?.- పవన్, జనసేన అధినేత
నాలుగు వేల మంది ఉద్యోగులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశ్యం లేని వైకాపా, వారికి పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చిందని పవన్ ధ్వజమెత్తారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి: TTD EO : 'తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి'