వ్యవస్థలను చేతుల్లో ఉంచుకోవడం ద్వారా ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి.. పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల శ్రేయస్సు పట్టించుకోకుండా తమ స్వార్థం కోసం ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి అన్ని రంగాల్లో నూతన ఒరవడితో సుపరిపాలన అందిస్తున్నారని.. తద్వారా సాగునీరు, వ్యవసాయ రంగాల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఏలూరులో పరిస్ధితులు అదుపు చేసేందుకు సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు జిల్లాలో అతిసారంతో 14 మంది చనిపోయారని.. ఆ రోజు ఆయన ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఇవీ చదవండి..