ETV Bharat / city

kishan reddy: 'కేంద్ర పథకాల అమలు మినహా.. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు' - కిషన్ రెడ్డి వార్తలు

కేంద్రం రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేస్తోందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రవాటా నిధులు లేక కొన్ని పథకాల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. కేంద్ర పథకాల అమలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదని స్పష్టం చేశారు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు.

kishan reddy
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
author img

By

Published : Aug 19, 2021, 10:16 AM IST

Updated : Aug 19, 2021, 11:11 AM IST

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి వర్గంలో ప్రధాని సామాజిక సమతుల్యాన్ని పాటించారని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయన్నారు. ప్రజాక్షేత్రంలోనే మంత్రులు.. పరిచయం చేసుకుంటారని ప్రధాని ప్రకటించారని చెప్పారు. అలా జన ఆశీర్వాదయాత్ర ప్రారంభమైందని తెలిపారు.

కేంద్రం అన్ని రకాలుగా రాష్ట్రానికి సాయం చేస్తోంది. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని పథకాల పనుల్లో జాప్యం జరుగుతోంది. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్ర భావన. ఏపీకి అనేక విద్యాసంస్థలను కేంద్రం మంజూరు చేసింది. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తాం. 'దేఖో అప్నా దేశ్' పేరుతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు చేపట్టాం. వచ్చే జనవరి నుంచి డిసెంబర్ వరకు పర్యాటకాభివృద్ధికి చర్యలు చేపడతాం. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలి. అలాగే.. వైద్యులను కలిసి విశ్వాసం పెంపొందించాలని ప్రధాని మాకు సూచించారు. ఆ మేరకు.. రాష్ట్రాల పర్యటన సందర్భంగా వైద్యులను కలిసి భరోసా ఇస్తున్నాం. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తాం. దేశ ప్రజలకు వ్యాక్సిన్ల ఖర్చును కేంద్రమే భరిస్తోంది. ఏపీకి కేంద్రం 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లు కేంద్రం పంపింది. - కిషన్‌ రెడ్డి కేంద్రమంత్రి

ఇతర విషయాలపైనా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే కొత్త వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నామని.. ఎగుమతులు ప్రోత్సహించడం, రైతు తనకు నచ్చిన చోట అమ్ముకోవటమే చట్టాల లక్ష్యమని చెప్పారు. రాజకీయ కారణాలతో కొన్ని సంఘాలు, పార్టీలు కొత్త చట్టాలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల పై రాజ్యాంగ సవరణ చేసి.. చట్టబద్దమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుకుందని చెప్పారు. ప్రధాని సాహసోపేత నిర్ణయంతో బీసీలకు కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు దక్కుతున్నాయన్నారు. మరోవైపు.. జనాభా ఎక్కువున్న దేశంలో కరోనాను ఎదుర్కోవడం కత్తిమీద సామే అని.. అయినా.. దేశంలో ఆక్సిజన్‌, ఇంజక్షన్ల కొరత లేదని.. కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రకారం కరోనాను దీటుగా ఎదుర్కోవాల్సి ఉందన్న కేంద్ర మంత్రి.. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలని చెప్పారు.

ఇదీ చదవండి:

TIRUMALA: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishan reddy: స్విమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

నేడు విజయవాడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర

Last Updated : Aug 19, 2021, 11:11 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.