"రెండేళ్లుగా ఎస్సీ వ్యతిరేక పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి.. ఆ వర్గాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేస్తూ చేస్తున్న మోసాన్ని గ్రహించండి" అంటూ.. మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. ఎస్సీ కార్పొరేషన్‌కు రూపాయి నిధులు సైతం కేటాయించకపోగా ఏ ఒక్కరికీ రుణాలు ఇవ్వలేదని మండిపడ్డారు.
సెంటు స్థలం పేరుతో వందల ఎకరాల అసైన్డ్ భూములు ఎస్సీల నుంచి లాక్కున్నారని ధ్వజమెత్తారు. లిడ్ క్యాప్‌ను నిర్వీర్యం చేసి ఆ భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ నియోజకవర్గంలో ఉన్న రాజధాని అమరావతిని తరలిస్తున్నారని దుయ్యబట్టారు. నామినేటేడ్ పోస్టుల్లో అధికశాతం సొంత సామాజికవర్గానికే కట్టబెట్టారని విమర్శించారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు జరగని రోజు లేదని లేఖలో జవహర్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: