ETV Bharat / city

Janasena on Amaravati Capital: అమరావతి రైతుల పక్షానే జనసేన: రామదాసు చౌదరి - జనసేన న్యూస్

Janasena on Amaravati Capital: జనసేన పార్టీ.. అమరావతి రైతుల పక్షాన ఉంటుందని ఆ పార్టీ రాయలసీమ కన్వీనర్ రామదాసు చౌదరి అన్నారు. 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో పాల్గొన్న ఆయన.. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా ఉంటుందని, ఈ మేరకు పవన్ కల్యాణ్ తనతో సందేశం పంపిచారని అన్నారు.

అమరావతి రైతుల పక్షానే జనసేన
అమరావతి రైతుల పక్షానే జనసేన
author img

By

Published : Dec 17, 2021, 8:06 PM IST

అమరావతి రైతుల పక్షానే జనసేన

Janasena on Amaravati Capital: అమరావతి రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాయలసీమ కన్వీనర్ రామదాసు చౌదరి అన్నారు. న్యాయస్థానం-దేవస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'లో ఆయన పాల్గొన్నారు. అమరావతే రాజధానిగా ఉంటుందని.. ఈ మేరకు పవన్ కల్యాణ్ తనతో సందేశం పంపిచారని అన్నారు. రైతుల పాదయాత్ర జనం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

ఆ శక్తి జగన్​కు లేదు..
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని.. అమరావతి మహోద్యమ సభ ఎలుగెత్తి చాటింది. అమరావతి రైతుల 45 రోజుల పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు పెద్దఎత్తున ప్రజలు, వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు.

ఆంక్షలు, నిర్బంధాలను దాటుకుని తిరుపతికి చేరుకున్నారు. దురుద్దేశంతోనే రాజధానికి ఓ కులం అంటగట్టి.. బడుగు బలహీన వర్గాలను అణగదొక్కే ప్రయత్నం చేశారని అమరావతి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రభుత్వం యత్నించిందన్నారు. అమరావతిని ఆపే శక్తి ముఖ్యమంత్రి జగన్‌కు లేదన్నారు.

తిరుపతిలో ముగిసిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.