ETV Bharat / city

tirumala rains: వరద విలయంలో ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం - tirumala rains

ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రం తిరుమల వరద విలయంలో చిక్కుకుంది.రహదారులన్నీ చెరువులను తలపించాయి. చరిత్రలో లేని విధంగా ఎగువ ప్రాంతాలనుంచి వరద వస్తుండటంతో తిరుపతిలోని దాదాపు అన్ని ప్రాంతాలు నీట మునిగాయి. నలువైపులనుంచి వరద తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వరదను బయటకు తీసుకెళ్లే కాలువల స్థాయి ఏమాత్రం సరిపోవడం లేదు.

tirumala rains
tirumala rains
author img

By

Published : Nov 19, 2021, 3:21 PM IST

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల వరద విలయంలో చిక్కుకుంది. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలు భక్తులకు భీతవాహ పరిస్థితిలా తలపించింది. నలువైపులనుంచి వచ్చిన వరద తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వరద నీరు ప్రవహిస్తుండటంతో ఈ మార్గాలను ఇప్పటికే మూసివేసిన తితిదే (ttd).. శుక్ర, శనివారాలు సైతం అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద... మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తోంది. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే.. నడక మార్గంలో భక్తులను అనుమతించడం లేదు. దీనివల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కొండ పైనుంచి వస్తున్న నీటితో క‌పిలేశ్వరాల‌యం వద్ద జలపాతం జోరుమీదుంది.పాపవినాశనం, జపాలి క్షేత్రాలకు వెళ్లే మార్గాల్లోనూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆ దారులను సైతం తితిదే మూసివేసింది. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాతే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపింది.

కనుమదారుల్లో పెద్దఎత్తున కొండల పైనుంచి వరద నీరు జలపాతాలుగా పడుతుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. రెండో కనుమదారిలో 14 చోట్ల కొండచరియలు కూలాయి. కనుమదారిలో చాలాచోట్ల వరద నీరు నిలిచిపోయి...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వన్యమృగాలు సైతం వరద భయంతో రోడ్లపైకి చేరాయి.

గతంలో ఏన్నడు లేని విధంగా...

గడిచిన 50 ఏళ్లలో తిరుపతిలో ఇంతటి వర్షాలను చూడలేదని ప్రజలు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున భారీ వర్షాలు, తుఫాన్లు తిరుపతి నగరాన్ని చుట్టుముడుతాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శలు వస్తున్నాయి.

ఘాట్ రోడ్లు మూసివేత...

తిరుమల రెండు ఘాట్‌రోడ్లను మూసివేస్తూ తితిదే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల కొండపైకి భక్తులను అనుమతించమని వెల్లడించారు. రెండు కనుమ దారులపై కొండచరియలు విరిగిపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే వివరించింది. ఈ రెండు ఘాట్‌ రోడ్లు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. రెండో ఘాట్‌ రోడ్‌లో 18 చోట్ల కొండచరియలు విరిగిపడ్డారు. వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో 2 ఘాట్‌రోడ్లు మూసివేశారు. ఫలితంగా కపిలతీర్థం, తిరుమల బైపాస్‌ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుచానూరులోని వసుంధర నగర్​లో భవనం నేలకూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.

భక్తులకు తప్పని ఇక్కట్లు...

వర్షాల ధాటికి శ్రీవారిని దర్శనానికి వచ్చిన భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారికి సత్రాల్లో వసతి కల్పించేందుకు తితిదే నిర్ణయించింది. వర్షం వల్ల తిరుమల వెళ్లలేని భక్తులకు తిరుపతిలోనే వసతి కల్పిస్తోంది. ఈ మేరకు శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లో భక్తులకు బస ఏర్పాటు చేసింది. దీనికి తోడు వర్షాలతో తిరుమల రాలేని భక్తుల దర్శనానికి మరో అవకాశం ఇచ్చేందుకు అనుమతించింది. నేడు, రేపు, ఎల్లుండి దర్శన టికెట్లు ఉంటే.. వాటిని తర్వాత దర్శనానికి వినియోగించేందుకు వెసులుబాటు కల్పించింది. వర్షాలు తగ్గాక భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తితిదే స్పష్టం చేసింది.

2015ను తలపించేలా...

2015లో తిరుపతిలో ఇదే తరహలోనే వర్ష బీభత్సం కొనసాగింది. 2015 తర్వాత కల్యాణి డ్యామ్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడం ఇదే ప్రథమం. అప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడగా... భక్తుల రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడింది.

ఇదీ చదవండి:

LIVE VIDEO: తిరుచానూరులో వరద ధాటికి కుప్పకూలిన భవనం

Missing: అన్నమయ్య జలాశయానికి పెరిగిన ఉధృతి...40 మంది గల్లంతు!

CM JAGAN: వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్​.. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం

'చట్టాల రద్దు ఎన్నికల గిమ్మిక్కే.. ఆందోళనలు ఆగవ్​!'​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.