ETV Bharat / city

RAINS IN TIRUPATI: తిరుపతిని ముంచెత్తిన వరద... నీటిలోనే జనం జాగారం

author img

By

Published : Nov 19, 2021, 5:51 AM IST

Updated : Nov 19, 2021, 7:22 AM IST

భారీ వర్షాలకు తిరుపతి అతలాకుతలమైంది. శేషాచల కొండలపై నుంచి వస్తున్న వరద నీటితో నగరం నీట మునిగింది. ఎటుచూసినా నీటితో... చెరువును తలపిస్తోంది. వరద నీరు పెద్దఎత్తున రహహదారులను ముంచెత్తింది. కార్లు, ద్విచక్ర వాహనాలు... కొట్టుకుపోయాయి. చరిత్రలో ఎప్పుడూ చూడనంత వరద నీరు తిరుపతి వీధుల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

rains
rains

తిరుపతిని ముంచెత్తిన వరద

కుండపోత వానలతో చిత్తూరు జిల్లా (Chittoor district ) లోని తిరుపతి వాసులు(heavy rains at Tirupati) ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాయుగుండం ప్రభావం వల్ల ఎడతెరిపిలేని వానలతో శేషాచలం కొండలు... జలపాతాలను(Waterfalls) తలపిస్తున్నాయి. కొండలపై నుంచి భారీగా వరద నీరు(flood water) దిగువకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కపిలతీర్థం, మాల్వాడి గుండం నుంచి వరద పరుగులెడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి పోటెత్తిన వరద... తిరుపతి నగరాన్ని చుట్టుముట్టింది. శివజ్యోతినగర్‌, మంగళం, పద్మావతిపురం, శ్రీనివాసపురం,శ్రీపురం,లక్ష్మీపురం కాలనీలను వరద ముంచెత్తింది. పద్మావతి విశ్వవిద్యాలయం (Padmavati University) లోని ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద నీరు చేరింది. పలు కాలనీల నుంచి ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

కొట్టుకపోయిన మూగజీవాలు, వాహనాలు

ఇంటిముందు నిలిపిన ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరాయి. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక ప్రజలు అవస్థలుపడుతున్నారు. రాత్రంతా వరద నీటిలోనే జాగారం చేశారు. మూగ జీవాలు వరదలో విలవిలలాడాయి. శివజ్యోతినగర్‌లో గేదెలు వరద ఉద్ధృతి (flood water) లో కొట్టుకుపోయాయి.

తిరుపతిని ముంచెత్తిన వరద... నీటిలోనే జనం జాగారం

తిరుపతి చరిత్రలోనే అతిపెద్ద వర్షం

భారీ చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం(power supply stoped) ఏర్పడింది. నగరంలోని రెండు రైల్వే మార్గాల వంతెనల కింద రాకపోకలను నిలిపివేశారు. పాఠశాలలకు సెలవు( Holiday for schools ) ప్రకటించకపోవడంతో విద్యార్థులు వరద నీటిలో చిక్కుకుపోయారు. స్విమ్స్, రుయా ఆస్పత్రి (Rua Hospital), అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయం, నగర పాలక సంస్థ కార్యాలయం, బస్టాండ్ (bus station), రైల్వే స్టేషన్ (Railway station) ఆవరణలు మొత్తం నీటితో నిండిపోయాయి. నగరం మొత్తం చెరువును తలపిస్తోంది. తిరుపతి(tirupathi) చరిత్రలోనే అతిపెద్ద భారీ వర్షం ఇదేనని స్థానికులు చెబుతున్నారు. వరద తీవ్రత దృష్ట్యా తిరుపతి నగర పాలక సంస్థ హెల్ప్‌లైన్‌(help line) ఏర్పాటు చేసింది. సాయం కోసం 0877- 2256766, 8297766789 నెంబర్లను నగర ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

నిలిచిపోయిన వైద్య సేవలు

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(Tirupati Government Maternity Hospital) లో వైద్య సేవలు నిలిచిపోయాయి. భారీ వరద కారణంగా ఆస్పత్రి విద్యుత్ మీటర్లు మునిగిపోయాయి. దీంతో విద్యుత్​కు అంతరాయం (power supply stoped) ఏర్పడింది. తక్షణమే స్పందించిన వైద్యాధికారులు 50 మంది రోగులనుసిమ్స్‌కు తరలించారు. విద్యుత్ పునరుద్ధరించే వరకు రోగులు ఆస్పత్రికిరావద్దని ఆస్పత్రి సూపరిండెంట్ స్పష్టం చేశారు.

విమానాలు వెనక్కి...

చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాల (Rains in ap) కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్ (flights diversion over heavy rains) వెళ్తున్నాయి. ఎయిరిండియా, స్పైస్‌జెట్ విమానాలు హైదరాబాద్​కు వెనుదిరిగి వెళ్లాయి. హైదరాబాద్-రేణిగుంట ఇండిగో విమానాన్ని విమానాశ్రయ అధికారులు బెంగళూరుకు మళ్లించారు.

ఇదీ చదవండి

Rains: తిరుపతి జలమయం..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు

Last Updated : Nov 19, 2021, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.