తిరుమలకు భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఎన్నికలు పూర్తవడం, విద్యార్థులకు సెలవులు వచ్చిన కారణంగా.. భక్తులు భారీగా తిరుమలకు వస్తున్నారు. సాధారణ సర్వదర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తుల నిరీక్షిస్తున్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోందన్నారు. భారీ రద్దీ కారణంగా.. తిరుమలలో గదులు దొరక్క.. కొందరు భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 22 గంటలు - తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. వారాంతంతో పాటు.. ఎన్నికలు పూర్తవడం, విద్యార్థులకు సెలవులు వచ్చిన కారణంగా.. భక్త జనం తిరుమలకు పోటెత్తింది.
తిరుమల