Governor Biswabhusan Harichandan News: తిరుమల శ్రీవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దర్శించుకున్నారు. ఈ మధ్యాహ్నం శ్రీ పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ దంపతులకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్‌కు తితిదే ఈవో అందజేశారు. అనంతరం తిరుపతిలో జరిగిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.
Governor Brother Injured at Tirupati: తిరుపతిలో గవర్నర్ బిశ్వభూషణ్ సోదరుడు గాయపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన గవర్నర్ కుటుంబ సభ్యులు.. తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో బస చేశారు. ఈ సందర్భంగా బాత్‌రూమ్‌లో గవర్నర్ సోదరుడు కిందపడిపోయారు. దీంతో చికిత్స నిమిత్తం వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: