తితిదే పాలకమండలి గడువు ముగియటంతో ప్రభుత్వం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. తక్షణమే ఈ అథారిటీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రత్యేక అథారిటీ ఛైర్మన్‌గా తితిదే ఈవో, కన్వీనర్‌గా అదనపు ఈవో బాధ్యతలు స్వీకరిస్తారు. పాలకమండలి అధికారాలన్నీ అథారిటీకి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖులు