ETV Bharat / city

E-Cars: ఇకపై విద్యుత్ కార్లను వినియోగించనున్న తితిదే అధికారులు

ఇకపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విద్యుత్ కార్లను వినియోగించనున్నారు. ఇఇఎస్ఎల్ ద్వారా కొనుగోలు చేసిన 35 కార్లను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

author img

By

Published : Aug 30, 2021, 7:57 PM IST

ఇకపై విద్యుత్ కార్లను వినియోగించనున్న తితిదే అధికారులు

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇకపై విద్యుత్ కార్లను వినియోగించనున్నారు. ఎనర్జీ​ ఎఫిషియన్సీ సర్వీసెస్​ లిమిటెడ్​ (ఇఇఎస్ఎల్) ద్వారా కొనుగోలు చేసిన 35 కార్లకు శ్రీ‌వారి ఆలయం వద్ద ఇవాళ పూజలు చేశారు. అనంతరం తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి జెండా ఊపి కార్లను ప్రారంభించారు. తితిదేలో పని చేసే ఉన్నతాధికారులు ఇకపై ఈ విద్యుత్ వాహనాలను వినియోగించనున్నారు. ఒక్కో వాహనానికి నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు తితిదేకు సొంతం కానున్నాయి.

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్న తితిదే ఛైర్మన్ వైవీ..మూడు దశల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వాహనాల వినియోగానికి చర్యలు తీసుకుంటామన్నారు. రెండో దశలో ధర్మరథాల స్థానంలో విద్యుత్‌ బస్సులు, మూడో దశలో ఆర్టీసీ బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు ప్రవేశపెడతామన్నారు.

జెండా ఊపి కార్లను ప్రారంభిస్తున్న తితిదే ఛైర్మన్

సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

తిరుమలలో ఇటీవల ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సంప్రదాయ భోజన విధానాన్ని నిలిపివేయనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో భక్తులకు భోజనం అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారని తెలిపిన సుబ్బారెడ్డి.. భక్తులకు ఉచితంగా భోజనం పెట్టాలని.. అన్నప్రసాదానికి నగదును తీసుకోకూడదన్నారు. తితిదే పాలకమండలి లేని సమయంలో తీసుకున్న నిర్ణయంపై అధికారులతో చర్చించి శాశ్వతంగా నిలిపివేయనున్నట్లు చెప్పారు. కరోనా కారణంగా నిలిపి వేసిన ఉచిత సర్వదర్శనాన్ని అమలు చేసేందుకు చర్చిస్తామన్నారు. జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వీలైనంత మందికి సర్వదర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోసంరక్షణశాలలోని గోపూజా కార్యక్రమంలో తితిదే ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్​ రెడ్డి పాల్గొన్నారు. గోశాలలోని వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాత, దూడకు నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీవారికి నవనీత సేవ ప్రారంభించడం సంతోషంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గోపూజ విశేష ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లామని.. వంద ఆలయాలలో గుడికో గోమాత కార్యక్రమం జరిగిందన్నారు.

గోగర్భం తీర్థం వద్ద వెలసివున్న కాళీయమర్థనునికి అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. గోక్షీరం, పెరుగు, తేనె, పరిమళ చందనం ఇత్యాది ద్రవ్యాలతో అభిషేకాదులు నిర్వహించారు. గోవర్థనునికి తలపాగా, ఉత్తరీయం, దోవతిలను ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం జరిగిన ఉట్లోత్సవం కార్యక్రమంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉట్టి కొట్టిన అనంతరం ప్రసాదవితరణ చేశారు.

ఇదీ చదవండి

THIRUMALA: తిరుమలలో సంప్రదాయ భోజనం కార్యక్రమం రద్దు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.