మందుల దుకాణం కోసం అనుమతులు మంజూరు చేసేందుకు లంచం అడిగిన ఓ ఔషధ నియంత్రణాధికారిని తిరుపతిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవిలాలలో మందుల దుకాణం పెట్టుకునేందుకు అనుమతి కోరిన ఓ వ్యక్తి నుంచి డ్రగ్ ఇన్ స్పెక్టర్ ప్రశాంతి 20వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా 13వేల రూపాయలు ఆమె తీసుకుంది.
బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అనిశా అధికారులు...మధ్యవర్తిని అదుపులోకి తీసుకోవటంతోపాటు నగరంలోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఔషధ నియంత్రణాధికారి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. డ్రగ్ ఇన్ స్పెక్టర్ ప్రశాంతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు అనిశా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: