తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాలకృష్ణతో తాను చేస్తున్న అఖండ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్.. ఆఖరి దశలో ఉందని చెప్పారు.
"అఖండ సినిమా చిత్రీకరణ ఆఖరి దశలో ఉంది. లొకేషన్ల కోసం వెతుకున్నాం. వర్షాలు లేని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని అనుకుంటున్నాం. చిత్తూరు, కడప జిల్లాల్లో చిత్రీకరణకు ప్రయత్నిస్తున్నాం. కరోనా తీవ్రత తగ్గి.. ప్రజలంతా ఆనందంగా ఉన్నప్పుడే చిత్రాన్ని విడుదల చేస్తాం" - బోయపాటి శ్రీనివాస్, సినీ దర్శకుడు
ఇదీ చదవండి: