తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా-జనసేన పార్టీ కూటమి నుంచే ఎవరు పోటీ చేస్తారన్న అంశం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. శనివారం తిరుపతిలో భాజపా నిర్వహించిన శోభాయాత్రలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి. వైకాపా అవినీతి పాలనకు గుణపాఠం చెప్పాలంటే తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయన కోరారు.
చంద్రబాబు(తెదేపా)కు పార్లమెంట్లో నాలుగు సీట్లు ఉన్నాయి. దిల్లీలో వారికేం పని లేదు. జగన్‌కి 22 సీట్లు ఉన్నాయి. వాళ్లకి నెగ్గినా ఉపయోగం లేదు. వచ్చే ఉప ఎన్నికల్లో భాజపాను గెలిపిస్తే తిరుపతిని స్వర్ణమయం చేస్తాం. జనసేన బలపరిచే భాజపా అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించండి- సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
వాస్తవానికి భాజపా-జనసేన సంయుక్త చర్చల తర్వాతే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తామని భాజపా అధినాయకత్వం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇదీ చదవండి