తిరుపతి ఉపఎన్నికలో వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి అభ్యర్థిత్వంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్ దేవ్‌ధర్ అన్నారు. గురుమూర్తి మతంపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పష్టత ఇవ్వటం లేదని సునీల్ దేవ్‌ధర్ ప్రశ్నించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని తిరుపతి బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీలు మతం మారితే దళిత రిజర్వేషన్ వర్తించదని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేర్కొన్నారని...కానీ రాష్ట్రంలో సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఆయన మండిపడ్డారు. శ్రీవారి నామాలు పెట్టుకుంటున్న తనను ఓ మంత్రి అవహేళన చేయటం సరికాదన్న ఆయన..శ్రీవారి నామాలు మీకు డ్రామాలాగా కనిపిస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'గురుమూర్తి.. ఇప్పటివరకూ తిరుమల శ్రీవారి ఆశీస్సులను తీసుకోకపోగా.. నామినేషన్ వేసే ముందు గూడూరులో పాస్టర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచి ఆ తర్వాత ఎందుకు తీసివేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం. ఎన్నికలు ముగిసినా ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు అని సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు.
రెండేళ్ల వైకాపా పాలనలో ఎవరైనా బాగుపడ్డారా ?: చంద్రబాబు
'పీఆర్ఓ ఉండగా మళ్లీ నియామకాలు ఎందుకు'