తిరుపతిలో నిర్వహించిన 'చాయ్ పే' చర్చ కార్యక్రమంలో వైకాపాపై భాజపా నేత సునీల్ దేవధర్ విమర్శలు గుప్పించారు. వాలంటీర్లు వైకాపా కరపత్రాలు పంచుతున్నారని ఆరోపించారు. మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వ్యాఖ్యానించారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తిపైనా ఫిర్యాదు చేస్తామన్నారు. వాలంటీర్లు, వైకాపా అభ్యర్థిపై రేపు సీఈసీకి ఫిర్యాదు చేస్తామని సునీల్ దేవధర్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బాబాయ్‌ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్‌కు లేదా..?