తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైకాపా రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపిస్తూ..తిరపతి కోదండరామస్వామి ఆలయం వద్ద భాజపా ఆందోళన చేపట్టింది. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓటర్లు ఆశ్రయం పొందారని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ, ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. స్థానికేతరుడైన పెద్దిరెడ్డి తిరుపతిలో ఎందుకు ఉన్నారని వారు ప్రశ్నించారు. వాలంటీర్లు వైకాపా కార్యకర్తలుగా పని చేసి..అడ్డగోలుగా డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారన్నారు.
151 మంది ఎమ్మెల్యేలున్నా జగన్‌కు ఎందుకు భయమని రత్నప్రభ ప్రశ్నించారు. దొంగ ఓట్ల వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. తిరుపతిలో రీ పోలింగ్ పెట్టి తీరాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి