తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తుల నుంచి పది వేల రూపాయలు వసూలు చేస్తున్న తితిదే.. వాటిని ఎక్కడ ఖర్చుపెడుతుందో చెప్పాలని భాజపా నేత ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. తిరుపతిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రాహ్మణ జాగృతి వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హిందూ ధార్మిక సంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని విమర్శించారు. అవన్నీ వైకాపా ప్రభుత్వ గుప్పెట్లోనే ఉన్నాయన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే పరిస్థితుల్లో మార్పులు వస్తాయన్నారు.
ఇదీ చదవండి: 'పబ్జీ' గొడవలో 13 ఏళ్ల బాలుడి హత్య!