ETV Bharat / city

లాక్​డౌన్​తో లాభం... అతని చేయి చేస్తోంది అద్భుతం!

ఆ యువకుడి చేతి నుంచి జాలువారే చిత్రాలు అబ్బుర పరుస్తాయి. అతను గీసే చిత్రాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. తన ఊహలకు రూపమిస్తూ రంగులద్దే చిత్రాలైతే ఆలోచనలను రగిలిస్తాయి. అద్భుత చిత్రాలు గీస్తూ తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు.

an engineer from tirupati, creating amazing arts

author img

By

Published : Jan 10, 2021, 7:01 AM IST

ఈటీవీ భారత్​తో కల్యాణ్

పల్లెదనం ఉట్టిపడే జానపద చిత్రాలు...ఆధ్యాత్మికత కలిగించే దేవతా చిత్రాలు...ఊహలకు రెక్కలు తొడిగి గీసే ప్రకృతి అందాలు...ఇలా వేటినైనా అబ్బుర పరిచేలా సృష్టిస్తున్నాడు తిరుపతికి చెందిన ఆముదాల కల్యాణ్. చిత్రకళలో ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా అద్భుతమైన చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు.

సెలవుల్లో మెళకువలు..

స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్​ చేశాడు కల్యాణ్... ఇంజనీరింగ్‌ చేస్తున్న సమయంలో తనలో నిద్రిస్తున్న చిత్రకళను తట్టిలేపాడు. అంతర్‌ కళాశాల పోటీలలో పాల్గొనేవాడు. తోటి విద్యార్థులు, అధ్యాపకుల అభినందనలతో పెయింటింగ్‌పై మక్కువ పెంచుకొన్నాడు. అనంతరం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం బెంగళూరులోని రేవా ఇనిస్టిట్యూట్‌లో చేరిన ఈ యువకుడు... చదువు కొనసాగిస్తూనే ఫైన్ ఆర్ట్స్‌ పై దృష్టి సారించాడు. చిత్రకళలో మెళకువలను నేర్చుకొన్నాడు. అలా పీజీ పూర్తయ్యేలోపు ఓ స్థాయి చిత్రకారుడైన తనను... కరోనా మహమ్మారి మరో స్థాయికి చేర్చిందని చెప్పాడు కల్యాణ్. లాక్​డౌన్ సమయంలో చిత్రకళలోని రకాలను అంతర్జాలంలో వెతికి పట్టుకొని తన కళకు మెరుగులు దిద్దుకున్నానని తెలిపాడు.

త్వరలో చిత్రాల ప్రదర్శన

అక్రలిక్‌ పెయింటింగ్‌ మధుబని, లాండ్‌ స్కేప్‌, కేరళ మురళ్‌ పెయింటింగ్‌, ఫాంటసీ ఆర్ట్‌, ఇండియన్‌ ఫోక్‌ ఆర్ట్‌, అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్‌ ఇలా వివిధ రకాల చిత్రకళతో అద్భుతమైన చిత్రాలు గీస్తున్నాడు కల్యాణ్. చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించక....మిన్నకుండిపోయిన కళ్యాణ్‌ లాక్‌డౌన్‌ సమయాన్ని చక్కగా వినియోగించుకొన్నాడు. బాపు బొమ్మలతో స్ఫూర్తి పొంది చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. తాను గీసిన చిత్రాలను కొన్ని రోజుల తరువాత ప్రదర్శనకు పెట్టాలని భావిస్తున్నాడు. కళ్యాణ్‌ ఆర్ట్‌ గాలరీ పేరుతో ఇన్‌స్టాగ్రాంలో ఖాతా ప్రారంభించి తన చిత్రాలను పంచుకొంటున్నాడు.

ఇదీ చదవండి

వృత్తి వైద్యం.. ప్రవృత్తి సాహితీ సేద్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.