ETV Bharat / city

శ్రీవాణి ట్రస్ట్​కు.. రూ.100 కోట్లు దాటిన విరాళాలు - తిరుమల శ్రీవారికి భక్తుల విరాళాలు న్యూస్

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి) ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోంది. ట్రస్టు ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల రూపాయల పైబడి విరాళాలు అందాయి. శనివారం నాటికి శ్రీవాణి ట్రస్టుకు భక్తులు అందచేసిన విరాళాలు 104 కోట్ల రూపాయలకు చేరాయి.

ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్​కు విరాళాలు 104 కోట్లు

author img

By

Published : Jan 10, 2021, 12:52 PM IST

తితిదే శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం(శ్రీవాణి) ట్రస్టును 2019 సంవత్సరం అక్టోబర్ 21న ఏర్పాటు చేశారు. ప్రారంభంలో భక్తుల నుంచి స్పందన కరవైంది. అదనపు ఈవో ధర్మారెడ్డి ట్రస్టును బలోపేతం చేసే దిశగా పలు మార్పులను తీసుకువచ్చారు. తక్కువ మొత్తంలో విరాళం ఇచ్చే భక్తులకు సైతం సౌకర్యాలు కల్పించేలా ట్రస్ట్‌ విధివిధానాలలో మార్పులు చేశారు. ఇప్పటి వరకు ఉన్న ట్రస్టులో లక్ష రూపాయలకు పైగా విరాళం అందించే దాతలకే సౌకర్యాలు కల్పిస్తున్న తితిదే... శ్రీవాణి ట్రస్టు ద్వారా 10 వేల రూపాయలను ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు పొందే అవకాశం కల్పించారు.

పది వేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళంతో పాటు 500 రూపాయలు చెల్లించి టిక్కెట్ పొందిన వారికి వీఐపీ దర్శన సమయంలో ప్రోటోకాల్‌ పరిధిలో శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఈ కారణంగా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2019 అక్టోబర్‌లో శ్రీవాణి ట్రస్ట్‌ ప్రారంభించినా కరోనా ప్రభావంతో 2020 మార్చి నుంచి దాదాపు మూడు నెలల పాటు ఎలాంటి దర్శనాలు కల్పించలేదు. ట్రస్ట్‌కు విరాళాలు ఆగిపోయాయి. 2019 అక్టోబర్‌ నుంచి 2020 మార్చి వరకు పూర్తి స్థాయిలో శ్రీవాణి దాతలకు దర్శనాలకు అవకాశం కల్పించారు.

కరోనాతో మూడు నెలల పాటు దర్శనాలు ఆపివేసిన తితిదే.. కొవిడ్‌ అనంతరం 2020 జూన్‌ నెల నుంచి డిసెంబర్‌ వరకు పరిమిత సంఖ్యలో శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు దర్శనాలు కల్పించింది. ఇప్పటి వరకు ట్రస్ట్‌కు ఆఫ్‌లైన్ ద్వారా 29,218 మంది 29.22 కోట్ల రూపాయలు, ఆన్‌లైన్‌ ద్వారా 54,457 మంది 70.43 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా 83, 675 మంది శ్రీవారిని దర్శించుకొన్నారు.

ఇదీ చదవండి:

వీలు కాదంటున్న ప్రభుత్వం.. జరిపి తీరాలంటున్న విపక్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.