ETV Bharat / city

కొవిడ్ బాధితులకు అవమానం.... మహిళను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని

The owner who prevented the wife from entering the house when the husband found Kovid
భర్తకు కొవిడ్‌ తేలడంతో భార్యను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని
author img

By

Published : Jul 23, 2020, 1:05 PM IST

Updated : Jul 23, 2020, 1:43 PM IST

13:02 July 23

మహిళను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న అద్దె ఇంటి యజమాని

అద్దె ఇళ్లల్లో ఉంటూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌ వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న దంపతుల్లో భర్తకు కొవిడ్​ నిర్ధరణ అయ్యింది. ఆ ఇంటి యజమాని వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నాడు. భర్త రాజమహంద్రవరంలోని కొవిడ్ అసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్తకు కొవిడ్‌ తేలడంతో భార్యను ఆ ఇంటి యజమాని ఇంట్లోకి రానివ్వలేదు. బాధితురాలు బుర్రిలంకలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఆమె రాత్రి నుంచి రోడ్డుపైనే  పడిగాపులు కాస్తోంది. సొంతింటికి వెళ్లగా అక్కడ కూడా స్థానికులు ఆమెను అడ్డుకుని ఇంటికి తాళం వేశారు. బాధితురాలు అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. 

ఇదీ చదవండి: రోడ్డుపైనే మృతదేహం... కన్నెత్తి చూడని జనం

Last Updated : Jul 23, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.