National Nursery Expo: రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన "నర్సరీ ల్యాండ్ స్కేప్ ఎక్స్‌పో-2022"కు విశేష స్పందన వస్తోంది. సందర్శకులు భారీగా తరలివచ్చి.. మొక్కలు, వివిధ జాతుల చెట్లు, వ్యవసాయ ఉత్పత్తులను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. దేశంలోని 17 రాష్ట్రాల నుంచి 130 స్టాళ్లను ఎక్స్‌పోలో ఏర్పాటుచేశారు. ఇండోర్, బొన్సాయ్, అలంకరణతోపాటు.. వివిధ రకాల మొక్కల్ని నర్సరీ నిర్వాహకులు కొలువుదీర్చారు.
National Nursery Expo: దేశ, విదేశీ రకాల మొక్కలు, ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తులు, పూలకుండీలు, ఉపకరణాలు, యంత్ర పరికరాలు... సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలతోపాటు.. పుణె, కేరళ, తమిళనాడు, గుజరాత్, బెంగళూరు సహా పలు ప్రాంతాలకు చెందిన మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
National Nursery Expo: ఉభయ గోదావరి జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచి ప్రకృతి ప్రేమికులు.. నర్సరీ ఎక్స్‌పోను సందర్శిస్తున్నారు. ప్రసిద్ధిగాంచిన సంస్థల ఉత్పత్తులు, మొక్కలను ఒకేచోట కొలువుదీర్చడం ఎంతో ఆనందిన్నిస్తోందని చెబుతున్నారు.
"ఇన్ని మొక్కలు ఒకేసారి చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చాలా రకాల బోన్సాయి మొక్కలు ఇక్కడ ఉన్నాయి. కొత్త రకాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే... విక్రయం లేదంటున్నారు. విక్రయిస్తే బాగుండేది. మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలని అనే చాలా అంశాలను బాగా వివరిస్తున్నారు. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అంతా చాలా బాగుంది." - ప్రకృతి ప్రేమికులు
National Nursery Expo: రాజమహేంద్రవరం ప్రజలతో పాటు ప్రకృతి ప్రేమికుల్ని ఎంతగానో ఆకట్టుకున్న నర్సరీ ల్యాండ్ స్కేప్ ఎక్స్‌పో ఇవాళ్టితో ముగుస్తుంది.
ఇదీ చదవండి: Mango Egg: మామిడికాయ గుడ్డు.. మీరెప్పుడైనా చూశారా..?