ETV Bharat / city

ONGC: ఓఎన్‌జీసీకి.. "బాహుబలి" రిగ్‌ - ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌

ONGC: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన, ప్రపంచంలోనే అత్యాధునిక సదుపాయాలున్న ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్‌ను సరఫరా చేసినట్లు ఎంఈఐఎల్‌ (మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌) తెలిపింది. దాదాపు 6,000 మీటర్ల లోతు వరకు వేగంగా డ్రిల్లింగ్‌ చేయగలదని పేర్కొంది.

MEIL provides a land drilling rigs to ONGC
ఓఎన్‌జీసీకి బాహుబలి రిగ్‌
author img

By

Published : Mar 9, 2022, 6:14 PM IST

ONGC: ఓఎన్‌జీసీ (ఆయిల్‌ అండ్‌ నాచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద నిర్వహిస్తున్న చమురు క్షేత్రానికి 2,000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన, ప్రపంచంలోనే అత్యాధునిక సదుపాయాలున్న ల్యాండ్‌ డ్రిల్లింగ్‌ రిగ్‌ను సరఫరా చేసినట్లు ఎంఈఐఎల్‌ (మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌) తెలిపింది. ఇది విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొంది. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ డ్రిల్లింగ్‌ రిగ్‌ 3,000 హెచ్‌పీ సామర్థ్యం గల సంప్రదాయ రిగ్గు కంటే అధిక పనితీరును ప్రదర్శిస్తుందని ఎంఈఐఎల్‌ వెల్లడించింది.

దాదాపు 6,000 మీటర్ల లోతు వరకు వేగంగా డ్రిల్లింగ్‌ చేయగలదని పేర్కొంది. ఇప్పటి వరకు 10 రిగ్గులను ఓఎన్‌జీసీకి సరఫరా చేయగా, ఇందులో మూడు కార్యకలాపాలు ప్రారంభించాయని, మిగిలిన వాటినీ తవ్వకాలకు సిద్ధం చేస్తున్నట్లు వివరించింది. చమురు, సహజ వాయువు రంగాల్లో డౌన్‌ స్ట్రీమ్‌, అప్‌ స్ట్రీమ్‌ విభాగాల్లో ఎంఈఐఎల్‌ క్రియాశీలక పాత్ర పోషించటానికి సిద్ధమవుతోందని ఎంఈఐఎల్‌ రిగ్స్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జి సత్యనారాయణ అన్నారు. ఇంధన ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చమురు, సహజవాయువు తవ్వకాలను అధికం చేయాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో తాము అందించే రిగ్గులు కీలకం అవుతున్నాయని వివరించారు. మనదేశంలో సొంతంగా చమురు డ్రిల్లింగ్‌ రిగ్గులు తయారు చేస్తున్న మొదటి ప్రైవేటు సంస్థ తమదేనని పేర్కొన్నారు. పూర్తి ఆటోమేటెడ్‌ హైడ్రాలిక్‌ రిగ్గులు కావడంతో సురక్షితంగా, వేగంగా డ్రిల్లింగ్‌ చేసే వీలుంటుందని, వ్యయమూ ఆదా అవుతుందని తెలిపారు.

మొత్తం 47 రిగ్గులు: ఓఎన్‌జీసీకి 47 రిగ్గులు సరఫరా చేసే కాంట్రాక్టును ఎంఈఐఎల్‌ పోటీ బిడ్డింగ్‌లో దక్కించుకుంది. ఇందులో 20 వర్క్‌ ఓవర్‌ రిగ్గులు, మరో 27 ల్యాండ్‌ రిగ్గులు. వీటిని అస్సోంలోని శిబ్‌ సాగర్‌, జోర్‌ హట్‌, ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, అంకలేశ్వర్‌, మెహసాన, కాంబే, త్రిపుర లోని అగర్తలా లోని ఓఎన్‌సీజీ సైట్లలో వినియోగిస్తారు.

ఇదీ చదవండి: ఉపాధ్యాయుల సేవలను ఆ కార్యక్రమాల్లో వినియోగించుకోవద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.