కష్టపడితే సాధించలేనిది ఏదీ ఉండబోదని రాష్ట్ర మహిళా - శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. స్థానిక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6వ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చదువుతోపాటు క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి అన్నారు . రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు భారత్ మాట్లాడుతూ అంతర్ జిల్లాల క్రీడలు రాజమహేంద్రవరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, 14, 16 ,18, 20 సంవత్సరాల వయసుగల సుమారు 1000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగామ సురేష్ , గోపాలపురం శాసనసభ్యులు టి.వెంకట్రావు, నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :