ETV Bharat / city

శ్మశాన వాటిక నిర్వహణ ఖర్చులు సైతం భరిస్తాం: ఆకుల సత్యనారాయణ

author img

By

Published : May 10, 2021, 4:39 PM IST

కొవిడ్ బారిన పడి వైద్యానికి లక్షల్లో ఖర్చుపెట్టినా ఆప్తుల్ని కోల్పోయే పరిస్థితి నెలకొందని వైకాపా నేత ఆకుల సత్యనారాయణ అన్నారు. అసలే బాధల్లో ఉన్న వారి కుటుంబాలను శ్మశాన వాటికల్లోనూ దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వాహనాల ద్వారా మృత దేహాల్ని తరలిస్తున్నామని.. ఇకపై శ్మశాన వాటిక నిర్వణహణ ఖర్చులు సైతం భరిస్తామని వెల్లడించారు.

ycp
ycp

కొవిడ్ విలయ తాండవం చేస్తోందని రాజమహేంద్రవరం నగర వైకాపా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ ఆవేదన చెందారు. వైద్యానికి లక్షల్లో ఖర్చుతోపాటు ఆప్తుల్నీ కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్నబాధిత కుటుంబాలను.. శ్మశాన వాటిలల్లోనూ దోచుకోవడం.. మరింత బాధకు గురిచేస్తోందన్నారు. రాజమహేంద్రవరం ఇన్నీస్ పేటలోని రోటరీ కైలాస భూమి శ్మశాన వాటికను తాను స్వయంగా పరిశీలించానని తెలిపారు.

అక్కడ దహన సంస్కారాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విరాళాల ద్వారా నిర్మించిన కైలాస భూమిలో.. నిర్వాహకులు మానవత్వానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆఖరి మజిలీలోనూ బాధిత కుటుంబాలను బాధిస్తున్నారని.. ఇప్పటికే తమ వాహనాల ద్వారా మృత దేహాల్ని తరలిస్తున్నామని తెలిపారు. శ్మశాన వాటిక నిర్వణహణ ఖర్చులు సైతం భరిస్తామని ఆకుల చెప్పారు.

ఇదీ చదవండి:

గంగానదిలో తేలిన 50 మృతదేహాలు.. ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.