Free Medical Camp at Nellore: ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన, ఐశ్వర్యవంతమైన, ఆర్థికంగా శక్తిశాలి.. అయిన భారతదేశాన్ని నిర్మించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో ప్రభుత్వంతోపాటు, ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి కోరారు. నెల్లూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్య నాయుడు ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్, గ్లోబల్ హాస్పిటల్ - చెన్నై సంయుక్తంగా వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఈ ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు.
శక్తివంతమైన భారత్ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి. యువతరం జీవన విధానం ఆందోళనకు గురిచేస్తోంది. దేశ భవిష్యత్తు అయిన యువత.. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. క్రమశిక్షణ గల జీవన విధానం అలవాటు చేసుకోవాలి. యోగా, వ్యాయామంతో ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మంచి ఆరోగ్యం కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతికి స్వస్తి చెప్పి.. భారతీయ ఆహారపు అలవాట్లపై దృష్టిసారించాలి. - వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: Paper leak: శ్రీకాకుళం జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్..! నిజం కాదన్న డీఈవో