నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు ఈ సాయంత్రానికి ముగియనుంది. ఉప ఎన్నిక ఏర్పాట్లను సోమవారం.. రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా పరిశీలించారు. పోలింగ్ సజావుగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. ముఖ్యంగా.. దొంగ ఓట్లకు వీలు లేకుండా ఓటర్ల జాబితాను ప్రదర్శించేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలుపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేశామని వెల్లడించారు. 127 సమస్యాత్మక ప్రాంతాల్లో.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేస్తామన్నారు.
ఇదీ చదవండి:
ఆత్మకూరు ఉపఎన్నికలో ప్రలోభాల పర్వం..
ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో వైకాపా వర్గ విబేధాలు.. నేతల ముందే రాళ్ల దాడి