కృష్ణా జిల్లా నందిగామ చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల రేషన్ బియ్యాన్ని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు. 10 టైర్ల లారీలో చందర్లపాడు మండలం నుంచి కాకినాడకు తరలిస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లారీని చందర్లపాడు పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ పొలీసులు జరిపిన దాడుల్లో లారీలో వెళ్తున్న 600 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు నుంచి క్రిష్ణపట్నం పోర్టుకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. ముందస్తు సమాచారంతో గౌరవరం టోలుప్లాజా వద్ద లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సప్లై అధికారులు ఇవీ రేషన్ బియ్యం కాదని చెప్పటంతో.. ఎటు తేల్చలేక అధికారులు ఆయోమయంలో పడ్డారు.
8 లక్షల విలువ చేసే రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని.. పొలీసులు అదుపులోకి తీసుకొని డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అయితే సివిల్ సప్లై అధికారులు పరిశీలించి.. అవి రేషన్ బియ్యం కాదని చెప్పటంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బియ్యాన్ని ల్యాబ్‌కు పంపి పరీక్షించనున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు.
ఇవీ చూడండి...