ETV Bharat / city

రహదారులపై వేడుకలకు అనుమతి లేదు: నెల్లూరు ఎస్పీ

రహదారులపై నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ తెలిపారు. యువత ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. కరోనా దృష్యా అందరు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సూచించారు. గత ఏడాది జిల్లా పోలీసుశాఖ పనితీరు సమాచారాన్ని నెల్లూరులో మీడియాకు తెలిపారు.

nellore district sp speech
నెల్లూరు జిల్లా ఎస్పీ
author img

By

Published : Dec 31, 2020, 4:31 PM IST

నూతన సంవత్సర సంబరాలకు రహదారులపై ఎలాంటి అనుమతి లేదని నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్​భూషణ్ వెల్లడించారు. రాత్రి రహదారులపై యువత గుమిగూడడం, కేకులు కట్ చేయడం, స్పీడ్.. ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే చర్యలు తీసుకుంటామని నెల్లూరులో తెలిపారు. కరోనా దృష్ట్యా పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

నేరాల శాతం తగ్గింది

నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో నెల్లూరు జిల్లా పోలీసుల పనితీరు మెరుగ్గా ఉందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రశంసించారు. గత ఏడాదితో పోల్చితే నేరాల శాతం తగ్గిందన్నారు. గతేడాది దొంగతనం కేసుల్లో రూ. 12 కోట్లు విలువైన సొత్తు చోరీ కాగా.. ఈ ఏడాది రూ. 6 కోట్లకు తగ్గిందన్నారు. రికవరీ కూడా 56శాతం ఉందని చెప్పారు.

గడచిన ఏడాది పనితీరు ఇలా..

రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 539 మంది మరణిస్తే.. ఈ ఏడాది మరణాల సంఖ్య 477కు తగ్గిందన్నారు. అత్యాచారం ఫోక్సో చట్టం కింద కేసులు మాత్రం 38 నుంచి 48 కి పెరిగాయని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కఠినంగా వ్యవహరించడంతో గత ఏడాది 94 కేసుల నమోదు కాగా.. ఈ ఏడాది 510 కి పెరిగాయన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడంలో పోలీసు యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు చేపట్టిందన్నారు. కరోనా సమయంలో పోలీసుల పనితీరు మెరుగ్గా ఉందని కొనియాడారు. దక్షిణ భారతదేశంలోని మొదటిసారిగా నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయానికి ఐఎస్​వో సర్టిఫికెట్ వచ్చిందని తెలిపారు. 100శాతం ఈ - ఆఫీస్ విధానం అమలు చేస్తున్న జిల్లాగా నెల్లూరుకు గుర్తింపు లభించిందన్నారు. కరోనా కారణంగా తాము ముందుగా నిర్దేశించుకున్న స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయలేకపోయామని.. రానున్న ఏడాదిలో పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'విపత్తు తక్షణ స్పందన దళం' వాహనాలను ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.