నెల్లూరును 40 కోట్ల రూపాయలతో సుందరంగా మారుస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నగరంలోని మూలపేటలో 3 కోట్ల 50 లక్షల రూపాయలతో కోనేరును తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. శనివారం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి మంత్రి బొత్స నెల్లూరులో పర్యటించారు. సంతపేటలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోసా ఆసుపత్రికి ఇద్దరు మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే వెంకటేశ్వరపురం టిడ్కో గృహాలను పరిశీలించారు.
ఇదీ చదవండి