ETV Bharat / city

'కాపు భవనానికి నారాయణ విద్యాసంస్థలిచ్చిన చెక్​ ఎక్కడ?' - nelore

ఎన్నికల తొందరలో నెల్లూరులోని కాపు భవనాన్ని నాసి రకంగా నిర్మించారని మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ ఆరోపించారు. కాపు భవనానికి మాజీ మంత్రి నారాయణ ఇచ్చిన విరాళం ఎక్కడుందో చెప్పాలని అధికారులను ఆదేశించారు.

నెల్లూరు కాపు భవనం పరిశీలించిన మంత్రి అనిల్​
author img

By

Published : Aug 21, 2019, 6:54 PM IST

నెల్లూరు కాపు భవనం పరిశీలించిన మంత్రి అనిల్​

నెల్లూరులో నిర్మిస్తున్న కాపు భవన్​ను వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. భవనాన్ని మంత్రి పరిశీలించారు. ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా నిర్మాణం చేశారని... నాసిరకంగా పనులు చేశారని ఆరోపించారు. భవనం ప్రారంభం కాకముందే చిన్నపాటి వర్షానికే లీకవుతోందన్న మంత్రి... పనుల్లో నాణ్యతపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాపు భవన్ ప్రారంభోత్సవ సమయంలో నారాయణ విద్యాసంస్థల తరపున ఇచ్చిన కోటి రూపాయల చెక్కు ఎక్కడుందో తేల్చాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి

వర్షంలోనూ... వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

For All Latest Updates

TAGGED:

nelorebhawan
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.