సినిమాల్లో బిజీగా ఉండటం వల్లే 'మా' ఎన్నికల జోలికి వెళ్లలేదని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. నెల్లూరు జిల్లా టౌన్హాల్లో గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ సర్వసభ్య సమావేశ జరిగింది. కోసూరు గోవిందయ్య గౌడ్, జానా రామచంద్రయ్య గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా సుమన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏసీబీ మాజీ డీఎస్పీ తోట ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా కోసూరు రాజశేఖర్ గౌడ్లను ఎన్నుకున్నారు. గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం నేత కోసూరు గోవిందయ్య.. కోటి రూపాయల విరాళాన్ని సుమన్ చేతుల మీదుగా గౌడ సేవా సమితి ట్రస్ట్‌కు అందజేశారు.
సినిమాలో బిజీగా ఉన్నప్పుడు రెండు పడవల మీద కాలు పెట్టడం సరైంది కాదని సుమన్ పేర్కొన్నారు. డ్రగ్స్ తీసుకోవడం ఒక్క సినీ ఫీల్డ్‌కే పరిమితం కాలేదని.. అన్నిచోట్ల ఉందన్నారు. సెలబ్రిటీలు కావడంతో అది విస్తృత ప్రచారం పొందుతోందని చెప్పారు. డ్రగ్స్, అత్యాచారం లాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇలాంటి ఘటనలు జరగవన్నారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్, ఎమ్మెల్యే జోగి రమేశ్, గౌడ సంఘం నాయకులు హాజరయ్యారు.
ఇదీ చదవండి..
VMRDA: వీఎంర్‌డీఏ బృహత్తర ప్రణాళిక-2041..వసూళ్లు మొదలుపెట్టిన మధ్యవర్తులు