BLADE ATTACK IN NELLORE : నెల్లూరులోని నక్కగోపాల్ నగర్‌లో స్థానికులపై దుండగులు దాడి చేశారు. 30వ డివిజన్‌లో గుడిసెలు తొలగించాలని బెదిరిస్తూ… బ్లేడ్‌లతో దాడికి పాల్పడ్డారు. స్థానిక మహిళలు దుండగులను అడ్డుకునేందుకు యత్నించినా వారినీ గాయపరిచారు. ఈ ఘటనలో టీఎన్ఎస్ఎఫ్ నేత ఆశిక్‌తో పాటు నలుగురు మహిళలు, ముగ్గురు యువకులు గాయపడ్డారు.
తీవ్రంగా రక్తం కారుతున్న బాధితులను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ బాధితులను పరామర్శించారు. వైకాపా శ్రేణులే ఈ దాడికి తెగబడ్డాయని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీచదవండి :