నెల్లూరు జిల్లాలో పెన్నా బ్యారేజీ పనులను ఈ ఏడాదే పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో పెన్నా బ్యారేజీని పరిశీలించిన ఆయన.. 13 ఏళ్లుగా బ్యారేజీ పనులు పూర్తికాకపోవడం బాధాకరమని అన్నారు. జిల్లాలోని రెండు బ్యారేజీలను పూర్తిచేసి.. అక్టోబర్, నవంబర్లో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో రూ.2,500 కోట్లతో త్వరలోనే పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.200 కోట్లు మిగిల్చామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి..