ETV Bharat / city

SALARIES PENDING: పని చేయిస్తూ.. పస్తులుంచుతూ.. - కర్నూలు తాజా వార్త

SALARIES PENDING: కొవిడ్ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్వహణ సిబ్బందికి చెల్లింపులు పెండింగ్​లో ఉన్నాయి. దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఐటీఐ విద్యార్థులే ఉన్నారు.

SALARIES PENDING
SALARIES PENDING
author img

By

Published : Feb 3, 2022, 1:52 PM IST

SALARIES PENDING: కొవిడ్‌ వైరస్‌ తెచ్చిన ముప్పు అందరికీ తెలిసిందే. రెండో దశలో చాలా మంది ఆక్సిజన్‌ అందక మృత్యుఒడికి చేరారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. వాటి నిర్వహణ (ఆపరేట్‌) చేసేందుకు కొంత మంది యువకులను నియమించింది. వారికి ముగ్గురు రీసోర్స్‌ పర్సన్లతో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ప్లాంట్ల వద్ద ఏర్పాటు చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆపరేట్లకు అందాల్సిన స్టైఫండ్‌ మాత్రం నేటికీ ఇవ్వకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది ఐటీఐ విద్యార్థులే..

కర్నూలులో ఆరుచోట్ల, ఆదోనిలోని ఏరియా ఆసుపత్రి, ఎంసీహెచ్‌ ఆసుపత్రి, నంద్యాల (డీహెచ్‌), కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కర్నూలు మెడికల్‌ కళాశాల, ఎమ్మిగనూరు, బనగానపల్లి, డోన్‌ ఏరియా ఆసుపత్రి, ఆత్మకూరు, ఆలూరు సీహెచ్‌సీల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఆ ప్లాంట్ల వద్ద ఆపరేట్‌ చేసేందుకు ఎక్కువ మందిని ఐటీఐ కళాశాలల్లో పలు ట్రేడుల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులతోపాటు మరికొంత మందిని రాష్ట్ర వ్యాప్తంగా 380 మందిని తీసుకున్నారు. జిల్లాలో 33 మందికిగాను వివిధ కారణాలతో నలుగురు యువకులకు రాలేదు. మిగతా 29 మందిని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సాంకేతికపరంగా ఎలక్ట్రానిక్, ఫిట్టర్, వెల్డర్, ఇన్‌స్ట్రూమెంట్‌ మెకానిక్‌ (ఐఎం) వంటి పలు ట్రేడ్ల విద్యార్థులను ఆక్సిజన్‌ ప్లాంటును ఆపరేట్‌ చేసేందుకు తీసుకున్నారు. వారికి కర్నూలు డీఎల్టీసీ ఐటీఐకి చెందిన ఎలక్ట్రానిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ విద్యాసాగర్, అవుకు ఐటీఐ కళాశాలకు చెందిన తిమ్మరాజు (వెల్డర్‌), అశోక్‌ (ఫిట్టర్‌) మూడు నెలలపాటు ఆక్సిజన్‌ ప్లాంటును ఎలా ఆపరేట్‌ చేయాలనే విధానంపై శిక్షణ ఇచ్చారు. తర్వాత వారికి ప్రాక్టికల్స్, ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించి, వారి నైపుణ్యానికిబట్టి ఆయా ప్రాంతాల్లోని ప్లాంట్ల వద్ద విధులు కేటాయించారు.

ఆగస్టు నుంచి స్టైఫండ్‌ శూన్యం...

2021 ఆగస్టులో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్ల వద్ద యంత్రాలను ఆపరేటింగ్‌ చేసేందుకుగాను ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులను నియమించారు. డోన్, తాండ్రపాడు, అవుకు ఐటీఐ కళాశాలల విద్యార్థులే ఉండటం గమనార్హం. వీరంతా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటారని అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు వరకు ఇన్‌స్ట్రక్టర్లు శిక్షణ ఇచ్చారు. తర్వాత వారికి ప్రాక్టికల్స్, ఆన్‌లైన్‌ ద్వారా థియరీ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం వారికి కేటాయించిన ప్లాంట్ల వద్ద విధులు కేటాయించారు.

అప్పటి నుంచి నేటి వరకు ఆ విద్యార్థులకు స్టైఫండ్‌ ఇవ్వకపోవడం దారుణం. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున రూ.1.74 లక్షలు ఇవ్వాల్సి ఉంది. 29 మందికి ఆరు నెలలకుగాను రూ.10.44 లక్షలు అవుతోంది. ఇలా ఆరు నెలలుగా చేయించుకుంటూ చెల్లించాల్సిన స్టైఫండ్‌ ఇవ్వకపోవడంతో పలువురు విద్యార్థులు మానేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. పని చేయించుకోవడమే తప్ప, తమను క్రమబద్ధీకరించి నెల నెలా వేతనాలు ఇస్తారనే ఆశలను నీరుగారుస్తున్నారని వాపోతున్నారు. దీనిపై సంబంధిత అధికారులను అడిగితే సరైన సమాధానం లేక సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో ప్రైవేట్‌ కంపెనీల్లో నెలకు రూ.20 వేలకుపైగా వేతనంతో ఉద్యోగాలు చేస్తూ ఆసుపత్రుల్లో శాశ్వత ఉద్యోగులం అవుతాయన్న ఆశతో ఇందులో చేరామని, తీరా ఇక్కడ కనీసం స్టైఫండ్‌ కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉన్నతాధికారులతో మొరపెట్టుకుంటున్నా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని, ఇష్టమొస్తే చేయండి.. లేకపోతే మానుకోండని సమాధానమిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:PROTESTS ON NEW DISTRICTS: కొత్త జిల్లాల ఏర్పాటుపై కొనసాగుతున్న నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.