ETV Bharat / city

Crime Today: ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడు - కర్నూలు లేటెస్ట్​ అప్​డేట్​

AP Crime News: రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందారు. కర్నూలు జిల్లాలో ఆస్తి కోసం అన్నను తమ్ముడు నరికి చంపగా... మరో ప్రమాదంలో ఒకరు మరణించారు.

crime today
crime today
author img

By

Published : Mar 7, 2022, 9:03 AM IST

Updated : Mar 7, 2022, 1:37 PM IST

ఆస్తి కోసం..

ఆస్తి తగాదాలు... నిండు ప్రాణాన్ని బలిగొన్న ఘటన కర్నూలు జిల్లా గోస్పాడు మండలం దీబగుంట్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగ శేషుడికి.. తన పెదనాన్న కొడుకైన ఆంజనేయులుతో కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆస్తి విషయంలో గత కొన్నిరోజులుగా తరుచూ గొడవ పడేవారు. మరోసారి తగాదా చోటుచేసుకోవడంతో.. ఆగ్రహించిన ఆంజనేయులు.. నాగశేషుడిని గొడ్డలితో నరికాడు. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆంజనేయులు, అతడి భార్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెండు లారీలు ఢీ... ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు బస్టాప్ వద్ద రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు బస్టాప్ వద్ద తాడిపత్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి భోజనం చేస్తున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి చెన్నైకి ఐరన్ కడ్డీల లోడ్​తో వెళ్తున్న​ లారీ... ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఐరన్​ లోడ్​లారీ డ్రైవర్​, క్లీనర్​ అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో డ్రైవర్ కర్ణాటకకు గదగ్ జిల్లాకు చెందిన ఉలిగప్పగా గుర్తించారు. క్లినర్ వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అదనపు కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా మేడి కొండూరులో చోటుచేసుకుంది. మేడి కొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్​కు గుంటూరు నగరానికి చెందిన శివరంజనీతో 15 వేళ్ల క్రితం వివాహమైంది. దుర్గా ప్రసాద్ టింబర్ డిపో వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందని అప్పులు తీర్చాలని... అధిక కట్నం కావాలని శివరంజనిపై ఒత్తిడి చేసేవాడు. ఈ దంపతుల మధ్య తరచూ మనస్పర్థలు వచ్చేవి.

ఈ క్రమంలో భర్త వేధింపులతో మనస్తాపానికి గురై ఫిబ్రవరి 26న శివరంజనీ ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 2న మరణించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చంద్రకళ(28) అనే వివాహిత అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. మృతురాలి భర్త తిమ్మప్ప దిన కూలితో జీవనం సాగిస్తున్నాడు. వడ్డీ వ్యాపారుల నుంచి సమారు రూ.7 లక్షలకు పైగా రూ.10 అధిక వడ్డీ కింది వేరొకరికి హామీగా ఉండి... చంద్రకళ అప్పులు ఇప్పించింది. సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో... వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు తెలిపారు. తల్లి మృతితో ముగ్గురు పిల్లలు అనాథులుగా మారరని ఆవేదన వ్యక్తం చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఎడ్లబండిని ఢీకొన్న ద్విచక్ర వాహనం... ఒకరు మృతి

One died: కర్నూలు జిల్లా పెద్దకడబురు మండలం కంబాలదిన్నె గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ద్విచక్ర వాహనం ఎడ్లబండిని ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుడు కంబాలదిన్నె గ్రామానికి చెందిన బోయ రామకృష్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

కృష్ణాజిల్లా కూచిపూడి... మొవ్వ మండలం కూచిపూడి స్టేట్ బ్యాంక్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ద్విచక్రవాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. అసలేంజరిగిందంటే... వేములమడ గ్రామానికి చెందిన బత్తిన మేలిక గోపాల కృష్ణ అనే వ్యక్తి... ప్రైవేట్ ఎలక్ట్రిషన్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి కూచిపూడిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా స్టేట్​బ్యాంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గోపాలపట్నంలో మూడు పూరిగుడిసెలు దగ్ధం

విశాఖ జిల్లా గోపాలపట్నంలోని చంద్రనగర్​లో 3 పూరి గుడిసెలుతో పాటు నగదు దగ్ధమైంది. రైల్వే ట్రాక్ అనుకొని ఉన్న సుమారు 20 పూరి గుడిసెలలోని ఒక గుడిసెలో షార్ట్​సర్క్యూట్​ వల్ల మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడి చుట్టుపక్కల గుడిసెలకు వ్యాపించాయి. మూడు గుడిసెలు, కొంత నగదు పూర్తిగా కాలిపోయాయి.

కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న బొలెరో వాహనం... ఏడుగురికి గాయాలు

కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలో బొలెరో వాహనం... కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఏడుగురుకి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Video Viral: చెత్త విషయంలో మహిళల మధ్య గొడవ... సామాజిక మాధ్యమాల్లో వైరల్‌

Last Updated : Mar 7, 2022, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.