ETV Bharat / city

ఆళ్లగడ్డ పోలీస్​స్టేషన్​లో శాంతి పూజలు... ఎందుకంటే...

author img

By

Published : Mar 7, 2022, 3:36 PM IST

Allagadda: కేసులు ఎక్కువగా వస్తున్నాయంటూ పోలీస్ స్టేషన్​లో శాంతి పూజలు చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో గోమూత్రం చల్లించి విశేష పూజలు చేశారు.

Allagadda
ఆళ్లగడ్డ పోలీస్​స్టేషన్​లో శాంతి పూజలు

Allagadda: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని పట్టణ పోలీస్ స్టేషన్​లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. స్టేషన్​కు కేసులు ఎక్కువగా వస్తున్నాయని పోలీసులు.. శాంతి పూజలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో అర్చకులు ఎస్సైల సమక్షంలో గోమూత్రం చల్లించి విశేష పూజలు చేశారు.

Allagadda: ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని వారాలుగా కేసుల సంఖ్య పెరిగాయి. అందులో పోలీసులకు ఇబ్బందిగా మారే కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా శుక్రవారం పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ పాముకాటుకుతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇవన్నీ గమనించి శాంతి పూజ చేస్తే సమస్యలు తొలగుతాయని కొందరు చెప్పడంతో.. పోలీసులు ఇలా చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంకో అడుగు ముందుకేసి జంతుబలి ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి: Murder: తూర్పుగోదావరి జిల్లాలో తండ్రిని హత్య చేసిన తనయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.