ETV Bharat / city

Tension at Atmakur: భాజపా నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

Tension at Atmakur
Tension at Atmakur
author img

By

Published : Jan 8, 2022, 8:05 PM IST

Updated : Jan 8, 2022, 10:35 PM IST

20:01 January 08

కర్నూలు: ఆత్మకూరులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

Tension at Atmakur City: కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ నిర్మాణం విషయంలో సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటంతో.. రాళ్లు రువ్వుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన భాజపా నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని ఓ వర్గంవారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి కారు ఒక్కసారిగా మనుషులపైకి వెళ్లటంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన మరో వర్గం... శ్రీకాంత్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు.. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

నిందితులపై కఠిన చర్యలు - డీజీపీ

ఆత్మకూరు ఘటనపై రాష్ట్ర డీజీపీ సవాంగ్ స్పందించారు. కర్నూలు జిల్లాలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించారని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఆయన.. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆత్మకూరు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాలని ఎస్పీని ఆదేశించామని వెల్లడించారు. ఆత్మకూరులో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

ఇదీ చదవండి:

New Corona Cases in AP: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 839 మందికి వైరస్..ఇద్దరు మృతి

Last Updated : Jan 8, 2022, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.